తన 17ఏళ్ల కెరీర్‌లో టాలీవుడ్‌లోని అందరు సీనియర్ స్టార్‌హీరోలు, యంగ్ స్టార్స్ సరసన కూడా త్రిష నటించింది. పరిశ్రమలో పోటీని తట్టుకొని ఇంత పెద్ద లాంగ్ కెరీర్ అంటే మాటలు కాదు. రోజుకో ముద్దుగుమ్మ పరిచయం అయ్యే ఇండస్ట్రీలో ఇది సామాన్యమైన విషయం కాదు. అయితే అందరు హీరోలతో నటించిన త్రిషకు ఇప్పటికీ ఓ తీరని కోరిక ఉందని... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష వెల్లడించింది. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలన్న తన కోరిక ఇప్పటి వరకు తీరలేదంటూ ఆమె అసంతృప్తిని వెల్లడించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనైనా తనకు ఈ అవకాశం రాలేదని... ఎప్పటికైనా ఆ కోరిక నెరవేరుతుందనే ఆశలో ఉన్నట్లు ఆమె వెల్లడించింది. తనకు అది తప్ప ఇంకేమీ కోరికలు లేవని, నటిగా తాను పూర్తి సంతృప్తితో ఉన్నట్లు ఆమె తెలిపింది. త్వరలో ఆ కోరిక కూడా తీరుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఆమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం...!