ప్రస్తుతం నాగచైతన్య, సమంతల ప్రేమ.. పెళ్లివరకు వచ్చిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై చైతూ, సమంతలు మౌనంగా ఉండటంతో ఇది నిజమేననే విషయం అర్దమవుతోంది. ఈ ఏడాది చివరిలోనే వీరిద్దరి వివాహం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో అక్కినేని ఫ్యామిలీకి కోడలు కానున్న సమంతపై ఇటీవల ఓ మీడియా సంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాఫ్యామిలీ హీరో అయిన సాయిధరమ్‌తేజ్ సమంత గురించి వికారమైన కామెంట్స్ చేశాడు. తనకు 'ఏ మాయ చేశావే' చిత్రం నుండి సమంత అంటే తనకు బాగా కోరిక ఉందని, అంతగా ఆమెను ప్రేమిస్తున్నానని సాయి కామెంట్ చేశాడు. ఎవరైనా తనకు జోడీగా సమంతను ఒప్పించి ఆమె డేట్స్ తెస్తే కథ, దర్శకుడు వంటి విషయాలను అసలు పట్టించుకోకుండా ఆమెతో కలిసి నటిస్తానని సాయి తెలిపాడు. అయితే అక్కినేని ఫ్యామిలీకి కోడలయ్యే సమంత గురించి మెగాఫ్యామిలీకి చెందిన ఈ హీరో అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.