Advertisement
Google Ads BL

భారత్, కాశ్మీర్ ను ఆక్రమించడమేంటి డిగ్గీరాజా..!


కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోమారు నోరు జారారు. నిత్యం వివాదాలతోనే ఆయన జీవితాన్ని గడపటానికి ఇష్టపడేవాడులా ఉంది... ఆయన తరహా మాటలు చూడపోతే. భారత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించాలన్నసదుద్దేశంతో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి తలగోక్కోవడం ఆయన వంతైంది. భారత్ కు కాశ్మీర్ గుండెకాయ లాంటిది. అలాంటి కాశ్మీర్ అంశంపైనే ఆయన నోరు పారేసుకున్నాడు. ఈ మాటల్ని బట్టి డిగ్గీరాజా పాకిస్తానీయుడేమోనన్న అనుమానులు రేపుతున్నాయి. లేకపోతే అలా మాట్లాడడని కూడా ప్రజలు విస్తుపోతున్నారు.

Advertisement
CJ Advs

కాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ పాక్ ఆక్రమిత కాశ్మీర్  అంశంపై  నరేంద్రమోడీ ఎక్కువగా ఆసక్తి కనబరచడం మంచిదే కానీ, ఆయన కాశ్మీరీయులతో చర్చలు జరపడం లేదని వెల్లడించాడు. అలా జరపకపోగా కాశ్మీరీయుల నమ్మకాన్ని పొందినట్లుగా ప్రధాని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని వివరించాడు. ఇంతవరకు బాగానే ఉంది. డిగ్గీరాజా డొల్లతనం ఇక్కడ బయటపడింది. కాశ్మీరీయులు పాక్ ఆక్రమిత కాశ్మీరీలైనా, భారత్ ఆక్రమిత కాశ్మీరీలైనా ఎవరైనా సరే చర్చలు తప్పకుండా జరపాలని సూచించాడు. అయినా కలలో కూడా రాని, వినకూడని విషయాలను ప్రస్తావిస్తుంటే ఈ డిగ్గీరాజా వారు అసలు ఇండియనేనా.... అన్న అనుమానం కలుగుతుంది. ఈ రసవత్తర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అప్పుడే దీనిపై కౌంటర్స్ కూడా మొదలయ్యాయి.  దిగ్విజయ్ సింగ్ భారత ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాడని, ఇది ఆయన పాకిస్థాన్ సోదరిమణులకు ఇచ్చే రాఖి బహుమతి అని బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఎద్దేవాచేశాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs