Advertisement
Google Ads BL

రామ్‌చరణ్‌ మేకోవరే దానికి కారణం....!


ప్రస్తుతం రామ్‌చరణ్‌ తమిళ 'తని ఒరువన్‌' చిత్రం రీమేక్‌ 'ధృవ' షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ టైటిల్‌లో 8 అని ఉండటం ఇప్పుడు అందరిలో చర్చను రేకెత్తిస్తోంది. 8 అనే నెంబర్‌కు 'ధృవ'కు ఉన్న లింక్‌ సినిమా విడుదలైతే గానీ సమాధానం దొరికేలా లేదు. కాగా ఈ చిత్రంలో చరణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ఆయన మేకోవర్‌ అయ్యాడు. 'ధృవ' తర్వాత రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వం లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్‌ ఒకటి లేదా రెండో వారంలో ప్రారంభిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం నవంబర్‌లో మొదలుకానుందని సమాచారం. సుకుమార్‌తో చేసే చిత్రం సింపుల్‌ లవ్‌స్టోరీ అని సమాచారం. పోలీస్‌ పాత్ర కోసం కండలు పెంచి మేకోవర్‌ అయిన చరణ్‌ సుకుమార్‌ చిత్రంలో లవర్‌బోయ్‌గా కనిపించనున్నాడు. దాంతో లవర్‌ బోయ్‌లా మేకోవర్‌ చెందడం కోసం చరణ్‌ ఈ టైమ్‌ని అదనంగా తీసుకుంటున్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs