Advertisement
Google Ads BL

సెప్టెంబర్‌ నుండి పెద్ద సినిమాల సందడి...!

janatha garage,producers,big cinemas,jr ntr,eedu gold ehe,majnu movie,premam movie | సెప్టెంబర్‌ నుండి పెద్ద సినిమాల సందడి...!

ఈ మధ్య కాలంలో రజనీకాంత్‌ 'కబాలి', వెంకటేష్‌ల 'బాబు బంగారం' చిత్రాలు మాత్రమే పెద్ద చిత్రాలుగా విడుదలయ్యాయి. మిగిలిన అన్ని వారాలు చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. రేపు కూడా 'ఆటాడుకుందాం..రా, చుట్టాలబ్బాయి' పోటీ పడుతున్నారు. వచ్చే రెండు వారాలు కూడా చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. కాగా సెప్టెంబర్‌ 2న 'జనతా గ్యారేజ్‌'తో ఎన్టీఆర్‌ మరలా పెద్దోళ్ల దండయాత్రకు సిద్దమవుతున్నాడు. ఆ తర్వాత సెప్టెంబర్‌ 9న సునీల్‌ నటిస్తున్న 'ఈడు గోల్డెహే' చిత్రం విడుదల కానుంది. సెప్టెంబర్‌ 16న నాగచైతన్య 'ప్రేమమ్‌' లేదా 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలలో ఒకటి రిలీజ్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాతి రోజున అంటే సెప్టెంబర్‌ 17న నాని 'మజ్ను' చిత్రం రిలీజ్‌ కానుంది. సెప్టెంబర్‌ 29న పూరీ, కళ్యాణ్‌రామ్‌ల 'ఇజం', ఆ పక్క రోజు రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ల 'హైపర్‌' విడుదలకు సిద్దమవుతున్నాయి. ఇక దసరా కానుకగా రామ్‌చరణ్‌ అక్టోబర్‌ 7న 'ధృవ' రానుందని సమాచారం. మొత్తానికి ఇన్ని చిత్రాలు విడుదలకు సిద్దమవుతుండటం సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంటే నిర్మాతల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs