అసలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే డ్యాన్సులు, స్టెప్పులు ఎంత కష్టతరమైనవైనా సరే సునాయాసంగా చేసేయగలడు. చాలామంది హీరోయిన్లు ఎన్టీఆర్‌కు ధీటుగా డ్యాన్స్‌లు చేయలేక నానా తంటాలు పడుతుంటారు. కాగా ఇప్పుటివరకు కాజల్ ఎన్టీఆర్‌తో మూడు చిత్రాలు చేసింది. హీరోయిన్‌గా ఎన్టీఆర్ సరసన 'బృందావనం, బాద్‌షా, టెంపర్' చిత్రాలు చేసింది. హీరోయిన్ గా ఏదో కొన్ని స్టెప్పులతో ఆమె ఓకే అనిపించింది. కానీ అదే ఓ ఐటం సాంగ్ లేదా స్పెషల్ సాంగ్‌ల సంగతి వేరు. ఎన్టీఆర్‌తో కలిసి ఐటం సాంగ్ అంటే ఎవరైనా భయపడిపోతారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న 'జనతా గ్యారేజ్'లో ఓ స్పెషల్ సాంగ్‌లో కాజల్ చిందేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. ఊరమాస్ స్టెప్పులు ఇప్పటివరకు కాజల్ కేవలం 'బాద్‌షా' చిత్రంలోనే కాస్తో కూస్తో చేసింది. తాజాగా 'జనతా గ్యారేజ్' స్పెషల్ సాంగ్‌లో ఎన్టీఆర్‌కు ధీటుగా కాజల్ ఊరమాస్ స్టెప్పులు వేయడానికి నానాతంటాలు పడుతోందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎన్టీఆర్‌తో సరిసమానంగా స్టెప్పులను ఆమె వేయలేకపోతోందని సమాచారం. మొత్తానికి ఈ విషయంలో ఎన్టీఆర్, కాజల్‌ను బాగా ఇబ్బందులు పెడుతున్నాడంటూ కొందరు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.