ఒకప్పుడు మహేష్ సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ తీసుకొని ఆ సమయాన్ని కుటుంబానికి వెచ్చించేవాడు. కానీ ఈ మధ్య కాలంలో అలాంటి గ్యాప్ లంటూ ఏం లేకుండా ఏకదాటిగా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు హీరో మహేష్ బాబు. మొన్న మహేష్ పుట్టిన రోజుకి రెండు రోజులు మాత్రమే దర్శకుడి అనుమతి తీసుకొని మరీ ఆ సమయాన్ని కుటుంబంతోనే గడిపాడు మహేష్ బాబు.
ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతుంది మహేష్ చిత్రం. దీనికి సంబంధించిన షూటింగ్ జూలై 29వ తేదీన హైదరాబాద్ లో మొదలై నిరాటంకంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఒక సాంగుతో పాటు కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లో నైట్ ఎఫెక్ట్స్ ఉండే షాట్స్ ను ఇక్కడ ఎక్కువగా చిత్రీకరించినట్లు తెలుస్తుంది. అదే విధంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా హైదరాబాద్ లోనే షూట్ చేశారంట. అయితే ఈ సినిమాకి ఇక్కడి షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. తర్వాత షెడ్యూల్ మహారాష్ట్రలోని పూణె, ముంబై, చెన్నైలలో ఉంటుంది. ఈ మధ్యలో మహేష్ ఓ వారం గ్యాప్ తీసుకుంటున్నట్లు సమాచారం.
కాగా ఈ గ్యాప్ లో మహేష్ బాబు ఏ టూర్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారో అన్నదానిపైనే అందరి దృష్టి ఉంది. ఎప్పటిలాగా ఖాళీ దొరికితే సినిమాలు చూట్టానికని ఏ లండన్, దుబాయ్, ప్యారిస్ వంటి చోట్లకు విదేశీయానం చేయానున్నాడా? లేక హైదరాబాద్ లోనే ఉండి ఇంకా సరికొత్త కథలను వింటూ పిల్లలు కుటుంబంతో గడపనున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.