Advertisement
Google Ads BL

కళ్యాణ్ రామ్ ఇవ్వబోతున్న షాకింగ్ న్యూసేంటి?


కళ్యాణ్ రామ్ - పూరి డైరెక్షన్ లో 'ఇజం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఇజం' చిత్రం ఇంకా సెట్స్ మీద ఉండగానే కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచిస్తున్నాడు. అవును ఇంత స్పీడ్ గా లేకపోతె హీరోగా నిలబడలేనని కళ్యాణ్ రామ్ ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే స్పీడ్ పెంచి సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ - సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కలిసి ఒక  సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ఎ.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనుంది. ఇక ఇప్పుడు కామెడీకి పెట్టింది పేరైన జి.నాగేశ్వరరెడ్డి తో మరో సినిమాకి కళ్యాణ్ రామ్ రెడీ అయ్యాడని సమాచారం. ఈ సినిమా ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలకు పూర్తి డిఫ్రెంట్ గా ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కేవలం మాస్ ఎలిమెంట్స్ వున్న సినిమాలే చేస్తూ వస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డితో తీసే  సినిమా రొమాంటిక్, కామెడీ లు కలగలిపి వుండబోతోందట. అయితే ఈ సినిమాకి బాలకృష్ణ నటించి... సూపర్ హిట్ కొట్టిన 'మంగమ్మ గారి మనవడు' సినిమాలోని ఒక పాటను టైటిల్ గా పెడదామని ఆలోచిస్తున్నారట. ఆ పాట 'దంచవే మేనత్త కూతురా'.... అదే పాట లిరిక్ ను టైటిల్ గా అనుకుంటున్నారట. 

Advertisement
CJ Advs

సరే ఈ సంగతి పక్కన పెడితే..కళ్యాణ్ రామ్ ఓ షాక్ ఇవ్వబోతున్నాడంట. రాబోయే ఈ రెండు సినిమాలు గనక సరిగ్గా ఆడకపోతే తాను ఒక సంచలన ప్రకటన చేస్తానని సన్నిహితుల దగ్గర కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. మరి ఆ సంచలన వార్త ఏమిటి..అంటూ రకరకాలుగా అందరూ ఊహిస్తున్నారు. ఆ సంచలన వార్త ఏమిటీ..అనేది తెలియాలంటే కళ్యాణ్ అనుకుంటున్న ఆ రెండు సినిమాలు విడుదలయ్యే వరకు వేచిచూడక తప్పదు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs