ఐటం గర్ల్ తో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపి ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన సెక్సీబాంబ్ ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' అన్న పాట తర్వాత టాలీవుడ్ లో భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది ఈ భామ. అసలు కొంత కాలం పాటు తెలుగు సినిమాల్లో ముమైత్ ఖాన్ తో సాంగ్ లేకుండా తెలుగు సినిమా విడుదల కాలేదంటే ఆమె రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో అర్థమౌతుంది. మొదట ఐటంగర్ల్ గా పేరొచ్చినా తర్వాత మంగతాయారు టిఫిన్ సెంటర్ తో హీరోయిన్ గా ముమైత్ ఖాన్ తమ అందాలను ఆరపోసింది. తర్వాత కొన్నాళ్ళపాటు మాయమై ముంబైలో గడిపిన ముమైత్ ఖాన్ చాన్నాళ్ళ తర్వాత స్టేజి షోల వంటి వాటిలో పాల్గొనేందుకు టాలీవుడ్ తో తమ బంధాన్ని కొనసాగించడం మొదలెట్టింది. ఈ మధ్య ఓ కార్యక్రమంలో ముమైత్ ఖాన్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ తో మీకున్న సంబంధం ఎలాంటిది అంటే ఆమె తడుముకోకుండా పూరికి నాకు అలాంటి సంబంధాలు లేవని, మా మధ్య ఏదో విషయం నడిచిందంటూ వచ్చిన పుకార్లను ఆమె కొట్టి పారేసింది.
ముమైత్ ఖాన్ ఎంత కొట్టేసినా, పూరి అప్పట్లో ముమైత్ ఖాన్ తో క్లోజ్ గా ఉన్నారని, అసలు ముమైత్ ఖాన్ కోసమే పూరి సినిమాల్లో సన్నివేశాలు సృష్టించాడని టాలీవుడ్ కోడై కూసింది. మరి ఈ విషయంపై ముమైత్ ఖాన్ లేట్ గా స్పందించినా హాట్ గానే చెప్పేసింది.