Advertisement
Google Ads BL

సంసారం అతనితోనే చేస్తుందంట..!


బాలీవుడ్ లో ప్రధానంగా ప్రేమ జంటలు పుడుతుంటాయి, బాగానే ఫలిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆలియా భట్-సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ వ్యవహారం అదే రకంగా సాగుతున్నట్టుగానే చెప్పాలి. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్' సినిమాతో మొదలైన వీరి మధ్య స్నేహం, ప్రేమగా మారింది. ఇంతకు ముందెన్నడు వీరి ప్రేమ విషయంలో ఎన్ని వార్తలు వచ్చినా ఏమాత్రం స్పందించని ఈ జంట నెగెటివ్ వార్తలను మాత్రం భరించలేకున్నారు. ఈ ఇద్దరి ప్రేమికులు విడిపోయారంటూ బాలీవుడ్ లో వస్తున్న వార్తలకు ఆలియా తీవ్రంగా స్పందించింది. ‘హీరో సిద్ధార్థ్ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. తనపై నాకున్న ఇష్టం ఎప్పటికి అలాగే ఉంటుంది. మా ఇద్దరికీ ఇష్టం ఉన్నంత వరకు మేమిద్దరం సంతోషంగా ఉంటామని' ఆలియా భట్ పొంగిపోతూ చెప్పకొచ్చింది.

Advertisement
CJ Advs

ఆలియా భట్ ఈ మధ్య ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ ప్రేమ వ్యవహారాన్ని టక్కుమని చెప్పేసింది. యాంకర్ జరిపిన ఇంటర్వ్యూలో భాగంగా 'మీరు ఎప్పుడైనా ఒక ద్వీపంలో గడపవలసిన అవసరం వస్తే ఎవరితో గడపడానికి ఇష్టపడతారు? ఇంకా అక్కడే సంసారం చేయవలసి వస్తే ఎవరితో చేస్తారు? అని ప్రశ్నించగా...  ఆలియా.. ఏ మాత్రం ఆలోచించకుండా జవాబులు చెప్పేసింది.  అక్కడ వారు ఇచ్చిన ఆప్షన్స్ లలో రణ్‌వీర్‌ సింగ్‌, రణబీర్‌ కపూర్‌, షాహిద్‌, వరుణ్‌ ధావన్‌ తదితర హీరోలు ఉన్నప్పటికీ వారెవరూ కాదన్నట్టు ఆలియా సిద్ధూతోనే సంతోషంగా గడుపుతాను' అంటూ ఠక్కున సమాధానం చెప్పింది. దీన్ని బట్టి వీరిద్దరి మధ్య ప్రేమ ఓ రేంజ్ లోనే సాగుతున్నట్లు అర్ధమౌతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs