Advertisement
Google Ads BL

సోనాక్షి తో పెట్టుకుంటే అంతే మరి..!


బాలీవుడ్‌ హాట్‌ ఫిగర్‌ సోనాక్షిసిన్హాతో మీడియా వారైనా..ఇంకేవరైనా మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంతే సమయస్ఫూర్తితో తిప్పికొట్టగల నైపుణ్యం ఆమె సొంతం. ఈ విషయంలో బాలీవుడ్‌లో ఎవర్నీ అడిగినా..వామ్మో అనేస్తారు. అటువంటి సోనాక్షికి మీడియా..డైరెక్ట్‌గానే ఓ ప్రశ్న వేసింది. మీకు, అర్జున్‌ కపూర్‌కి మధ్య విషయం నడుస్తుందంట కదా..! అని అడగ్గా దీనికి సోనాక్షిసిన్హా..అవును నడుస్తుంది..నీకేమైనా అభ్యంతరమా..! అంటూ డైరెక్ట్‌గా ఆ ప్రశ్న అడిగిన మీడియా పర్సన్‌కి చెప్పేసింది. అయితే ఆ మీడియా పర్సన్‌ కూడా తగ్గకుండా..అవును అభ్యంతరమే..మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. మీ స్థాయి కాదు అని ఆగాను..కానీ..లేదంటే ఎప్పుడో ప్రపోజ్‌ చేసేవాడిని అన్నాడంట. దీంతో ఒక్కసారిగా సోనాక్షికి కోపం పోయి హాయిగా నవ్వుకుందట. అంతేకాదు, అతన్ని దగ్గరకు పిలుచుకుని ప్రేమగా అతనితో మాట్లాడిందంట కూడా. ప్రేమను ఎవరైనా ఎక్స్‌ప్రెస్‌ చేయవచ్చు. కానీ దాని పేరుతో విచ్చలవిడి వ్యవహారమే తప్పు అన్నట్లుగా చెప్పి..నీవు చాలా లేట్‌ అయ్యావు. ఎందుకంటే నేను అల్రెడీ లవ్‌లో ఉన్నా..అంటూ చెప్పిందట. అయితే మీరనుకుంటున్న అర్జున్‌ కపూర్‌తో అయితే కాదు. సల్మాన్‌ ఖాన్‌ బంధువైన బంటీ సచ్‌దేవ్‌తో అల్రెడీ ప్రేమలో మునిగితేలుతున్నాననీ..క్లియర్‌గా తన లవ్‌ వ్యవహారం చెప్పేసిందట సోనాక్షి. ఇదంతా చెప్పాక..అర్జున్‌తో వ్యవహారంపై క్లారిటీ వచ్చినట్లేనా..ఇంకా గాసిప్స్‌ పుట్టిస్తారా..!! అంటూ చిన్న ఝలక్‌ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిందట ఈ అమ్మడు. ఎంతైనా సోనాక్షి..గడుసరి కదా..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs