తాజాగా జరిగిన 'జనతా గ్యారేజ్' ఆడియోలో యంగ్‌టైగర్ యన్టీఆర్ స్పీచ్ మొదలుపెట్టే ముందు.. ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు, తన అభిమానులకు కూడా ఓ విన్నపం వినిపించాడు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం.. మీకు బాధను కలిగించవచ్చు. నేను నన్ను తగ్గించుకుని చెబుతున్నా...దీనివల్ల ఎవరైనా..బాధపడి ఉంటే క్షమించాలి.. అని చెప్పాడు. అయితే యన్టీఆర్ ఇలా ఎందుకు అంటున్నాడో...ఎవ్వరికీ అర్ధం కాలేదు. యన్టీఆర్ అలా చెప్పిన తర్వాత అసలు ఏ విషయంలో తనని తాను తగ్గించుకుంటున్నాడా..! అని అందరూ అనుకున్నారు. అయితే యన్టీఆర్ తగ్గిన విషయం ఏమిటంటే..ఏ హీరో అయినా..తనకి హిట్స్ లేవని చెప్పడానికి అస్సలు ఒప్పుకోరు. అలాంటిది తనకు పుష్కరకాలంగా సరైన హిట్ లేదని యన్టీఆర్ తెలిపాడు. అంతేకాదు, ఈ పుష్కర కాలంలో చేసిన సినిమాలు కూడా ఏదో చేయాలి కాబట్టి చేశానంతే ..అంటూ..యన్టీఆర్ నిజాయితీగా నిజాలను ఒప్పుకోవడానికే ముందుగా ఇలా అందర్నీ ప్రిపేర్ చేశాడని తెలుస్తుంది. అంతేకాదు, దీనివల్ల బాధపడేవారు ఎవరు..అంటే ఫ్యాన్స్ కంటే కూడా ఎన్టీఆర్‌తో ఈ పుష్కరకాలంలో సినిమాలు చేసిన వారే కాబట్టి..వారిని కూడా ముందుగానే ప్రిపేర్ చేశాడన్నమాట. అందుకే ముందే తగ్గుతున్నానని బాధ పడవద్దు ..అంటూ స్టార్ట్ చేశాడన్నమాట. అది విషయం.