ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవార్కర్ ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసిన చిత్రం మెహంజదారో. ఈ చిత్రం పేరు వినగానే గొప్ప చారిత్రక చిత్రంగా, బ్రహ్మాండమైన విజువల్ వండర్ గా ఊహించడం సహజం. కానీ మెహంజదారో చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం అందులో చరిత్రకు సంబంధించిన కథే లేదు, అదేం చారిత్రక చిత్రం, అసలు ఆ పేరెందుకు పెట్టారో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
పల్లెటూరులో నివశించే హీరో మెహంజదారో గురించి విని అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. తీరా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి మెస్మరైజ్ అయిపోతాడు. తిరిగి వద్దామనుకొనే లోపే ఓ పూజారిని చూసి ప్రేమలో పడిపోతాడు. అదే మెహంజదారోలో ఓ కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు ఆ రాజ్యాన్ని దుర్మార్గంగా పాలిస్తూ, అక్కడి ప్రజలను వేధిస్తుంటారు. అది విషయం.. అక్కడ వారిపై పోరాడి హీరో ఎలా ప్రజలను కాపాడాడు అన్నదే కథాంశం.
మొత్తం సినిమాకు గాను ఆశ్చర్యం కలిగించే సెట్స్, ఏ ఆర్ రెహమాన్ సంగీతం తప్ప పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు అని టాక్. ఏం లేని కథలో గొప్ప సెట్స్ తో కనువిందును, మ్యూజిక్ తో వీనుల విందును చవి చూస్తామే తప్ప అందులో వెయ్యి కోట్లు చేసే విషయం ఏం లేదంటూ సినీ విమర్శకులు భావిస్తున్నారు.