Advertisement
Google Ads BL

పవన్ ను గురి చూపేలా.. జేపీ తూటా!


రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయడం సర్వసాధారణం. రాజకీయాల్లో తల పండిన నాయకులకు అవకాశవాద రాజకీయాలు నడపడం, ఆ విధంగా వారు లబ్ది పొందడం చాలా సరదా. ఈ మధ్య రాజకీయాలు సినీ గ్లామర్ చుట్టూ తిరుగుతున్నాయి. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ అవకాశాన్ని బట్టి  సినీ హీరోలను, హీరోయిన్లను ప్రచారానికి ఉపయోగించుకోవడం జరిగింది. అయితే  దాంతో ఎంతవరకు లబ్ది పొందారు అన్న విషయం పక్కన పెడితే అసలు పటిష్టమైన పార్టీ గానీ, బలమైన అధినాయకత్వంగానీ సినీ గ్లామర్ వెంట పడటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

Advertisement
CJ Advs

రాజకీయ నాయకులకు నిరంతరం ప్రజలలో ఉంటేనే ఆదరణ ఉంటుందంటారు. అలాగే సినిమా కళాకారులకు మాత్రం అది విరుద్ధం. సినిమా వాళ్ళు ఎలా పడితే అలా తిరుగుతూ బొమ్మల రూపంలో కాకుండా నిరంతరం ప్రత్యక్షంగా కనిపిస్తున్నారనుకోండి.. వారి పట్ల ప్రజలకు ప్యాషన్ తగ్గుతుందనే భావించాలి. అలాంటివి కొంత మందికి మినహాయింపు అనుకోండి. సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఎన్నికలు రాబోతున్నాయని తెలియగానే రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రచార సభలకు సినీ గ్లామర్ ను వాడుకోవడం అలవాటుగా మారింది. ఆ కళాకారులు ఆయా ప్రచార సభల్లో సినిమా డైలాగులు నాలుగు విసిరి ఆ కాసేపు బలమైన ప్రభావం ప్రజలపై చూపి ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడానికి బాటలు వేస్తున్నారు. అలా సినిమా హీరో హీరోయిన్లు కూడా రాజకీయాల్లో కీలకంగా మారిన సందర్భాలు మనం గతంలో చాలా చూశాం. కానీ ఆ ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచే వాళ్ళు ప్రజలను పట్టించుకోకపోవడం, ప్రజలకు ఏం జరిగినా, ఎన్ని బాధలు పడుతున్న వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం జరుగుతుంది.  ఈ ప్రహసనం అంతా ఓ సినిమాగానే జరుగుతుంటుంది. ఇప్పుడు లోకసత్తా పార్టీ అధ్యక్షుడు జేపీకి ఎందుకు కోపం వచ్చిందో గానీ సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ ఆ  ఎన్నికల కాసేపు మాత్రమే తిరిగి ఆ తర్వాత ప్రజలను మోసం చేయాలని చూసే ఎత్తులు మాత్రం వేయకూడదు అంటూ మండిపడుతున్నారు. ఇది ఎవరికి తగిలిందో మరి. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం మా  పవన్ నే అలా అంటాారా? అంటూ మదనపడుతున్నారు. అప్పుడప్పుడు  ప్రభుత్వంపై ఫైర్ అవుతూ, కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నారు కదా అని మండిపడుతున్నారు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs