దేవినేని నెహ్రూ టిడిపి లోకి వెళ్ళబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఈ ఫోటోని చూసిన వారందరు. దేవినేని నెహ్రూ బెజవాడ రాజకీయాల్లో తల పండిన రాజకీయ నాయకుడు. ఈయన ఎన్టీఆర్ టైం లో టిడిపిలో ఉండి తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యాడు. అయితే తెలుగు రాష్ట్రాలను విడగొట్టి అపకీర్తి మూటగట్టుకున్న కాంగ్రెస్... ఏపీ లో అసలు సోదిలోకి లేకుండా పోయింది. అయినా దేవినేని నెహ్రూ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ... అతని కొడుకుని కూడా కాంగ్రెసు నుంచే ఎంపీ పదవికి పోటీ చేయించాడు. అయితే అయన కొడుకు అవినాష్ గత ఎన్నికల్లో ఓడిపోయినా... విజయవాడ కాంగ్రెస్ పార్టీ పనుల్లో మాత్రం చురుగ్గానే పాల్గొంటున్నాడు. ఇక దేవినేని నెహ్రూ ఈ మధ్య టిడిపి వైపు చూస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ నుండి టిడిపిలోకి మారడానికి పావులు కదుపుతున్నాడని ... అవకాశం రాగానే జంప్ అవ్వడానికి రెడీ గా వున్నాడని అంటున్నారు. అయితే తాజాగా దేవినేని నెహ్రూ తమ్ముడు భాజీ ప్రసాద్ అనారోగ్యం తో కన్ను మూశాడు. అయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి టిడిపి తరుపున లోకేష్, దేవినేని ఉమా, కేశినేని నాని వెళ్లారు. అయితే కుటుంబ సభ్యులను ఓదార్చిన తర్వాత లోకేష్, నాని, దేవినేని ఉమా... దేవినేని నెహ్రతో కలిసి లంచ్ చేశారు. ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. దేవినేని నెహ్రూ.. లోకేష్ తో సమావేశమయ్యాడని..నెహ్రూ టిడిపిలోకి వెళ్ళడానికి ఈ లంచ్ పార్టీయే సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.