'మనమంతా' ఇప్పుడు అందరి నోటిలో నానుతున్న సినిమా. మధ్యతరగతి జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించిన సినిమా 'మనమంతా'. ఈ సినిమాని చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత.. ఇండస్ట్రీ లోని పలువురు పెద్దలు ఈ సినిమాని అభినందిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాజమౌళి అయితే ట్విట్టర్ లో పదే పదే ఈ సినిమా గురించి గొప్పగా చెప్తున్నాడు. అంతే కాకుండా రాజమౌళి ఒకడుగు ముందుకేసి మనమంతా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటిని ఇంటర్వ్యూ కూడా చేశాడు. యేలేటి తీసిన సినిమాని రాజమౌళి మనస్ఫూర్తిగా అభినందించి ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు. 'మనమంతా' సినిమాని అందరూ ఆర్ట్ సినిమా అనుకుంటారు కానీ ఈ సినిమా ఒక మిడిల్ క్లాస్ జీవితంలో మనం ఎన్ని ఇబ్బందులు పడతామో దానిని ఒక సినిమా కింద మనకు యేలేటి చూపించాడని రాజమౌళి అన్నారు. నాకు ఆర్ట్ సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదని.. ముందు ఈ సినిమాని నేను ఆర్ట్ సినిమాలాగే అనుకున్నానని కానీ సినిమా చూసిన తర్వాత అర్ధం అయ్యిందని రాజమౌళి అన్నారు. ఒక్కో కేరెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చారు అని రాజమౌళి అడగగా... దానికి చంద్రశేఖర్ యేలేటి ప్రతి ఒక్క కేరెక్టర్ కి ఒకే సమయాన్ని కేటాయించి అందరిని గొప్పగా చూపించాలనే ప్రయత్నించానని... ఒకరు గొప్ప మరొకరు కాదు అనే ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క కేరెక్టర్ ని మలచగలిగానని... ప్రతి ఒక్క కేరెక్టర్ కి ఆయా నటులు ప్రాణం పోశారని చెప్పాడు. ఇంకా మోహన్ లాల్ గురుంచి వేరే చెప్పక్కర్లేదు అయన ఒక గొప్ప నటుడు అని.... గౌతమి ఎంత మంచి నటో అందరికి తెలిసినదే కదా అని అన్నాడు. అలాగే ప్రతి ఒక్క సీన్ ని గుర్తు చేస్తూ రాజమౌళి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ యేలేటి సమాధానాలు చెప్పాడు. రాజమౌళి అంతటి వారు.. ఒక చిన్న సినిమాని ప్రోత్సహించడానికి ఇలా ఆ చిత్ర డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిని ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వచ్చారంటే..ఈ సినిమా రాజమౌళికి ఎంతగా నచ్చి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే రాజమౌళి లో మొదటినుండి వున్న గొప్పతనం.
Click Here to see the SS Rajamouli Interviews Chandrasekhar Yeleti Video