Advertisement
Google Ads BL

'మనమంతా' యేలేటి కి ఏం ఇవ్వగలం..?


చంద్రశేఖర్ యేలేటి. ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమంతా 'మనమంతా' దర్శకుడైన చంద్రశేఖర్ యేలేటి పేరునే స్మరిస్తుంది. వెరైటీ కథాంశాలతో విభిన్నమైన కథనాలతో ఎంతో వైవిధ్యభరితంగా సినిమాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ యేలేటి రూటే సపరేటు. ఆయన దర్శకత్వం వహించే ప్రతి చిత్రం నూతనంగా ఉంటుంది. ఆయన ఎంచుకునే కథాంశాలు అంతవరకు.. ఎవరూ దృష్టి పెట్టనివై ఉంటాయి.  ఐతే మొదలు కొని అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం, మనమంతా వరకు ప్రతి సినిమాను ఓ అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు దర్శక మేధావి చంద్రశేఖర్ యేలేటి. సినిమాయే జీవితంగా సాగే చంద్రశేఖర్ యేలేటి ఆలోచన ఎప్పుడూ చుట్టూ ఉన్న సమాజంలోని అంశాలను అద్భుతంగా తెరకెక్కించడం ఎలా అన్న దానిపైన తిరుగుతుంటుంది. వారి ప్రతి చిత్రం సమాజానికి అద్దం పడుతుంది. హ్యూమన్ ఎమోషనాలిటీని చక్కటి డ్రామాగా మలిచి, కథనాన్ని పండించడంలో చంద్రశేఖర్ యేలేేటి సిద్ధహస్తుడు.

Advertisement
CJ Advs

చంద్రశేఖర్ యేలేటి  2004 లో విడుదలైన తొలి చిత్రం 'ఐతే' తోనే నేషనల్ అవార్డు దక్కించుకున్న దర్శకుని ప్రతిభ అమోఘమనే చెప్పాలి.  ప్రస్తుతం 'మనమంతా' చిత్రం ద్వారా చంద్రశేఖర్ యేలేటి తెలుగు ప్రజలను అమితంగా ఆకర్షించిన యేలేటికి ఇంత వరకు  స్టార్ డైరెక్టర్ హోదా రాకపోవడం తెలుగు సినిమా దౌర్భగ్యం అనే చెప్పాలి. ఇతర సినిమాలు చూసి..అందులో సీన్లు యాజిటీజ్ గా వాడేసే వారు స్టార్ స్టేటస్ అనుభవిస్తుంటే..తాను తీసే ప్రతి సినిమా మనది అని గర్వంగా చెప్పుకునే సినిమాలు తీసే యేలేటి కి.. ఇండస్ట్రీని యేలే పేరు లేకపోవడం..రాకపోవడం నిజంగా బాధాకరం. ఇకనైనా 'మనమంతా' కలిసి యేలేటికి తగిన గుర్తింపు ఇవ్వకపోతే..ఇది మనది, ఇది మన కథ అని చెప్పుకునే సినిమాలే వుండవంటే ఆశర్యపోవాల్సిన అవసరం లేదు.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs