Advertisement
Google Ads BL

డొనేట్ చేసైనా...హిట్ కొడతాడా..!!


అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్‌కు హీరోకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. 'సత్యం, గౌరీ, గోదావరి' వంటి మంచి చిత్రాలు వచ్చినా కూడా ఈ హీరో తన కెరీర్‌ను మలచుకోవడంలో విఫలయ్యాడు. కాగా ఆయన తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనైనా నిలదొక్కువాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన బాలీవుడ్‌ హిట్‌ చిత్రం 'విక్కీ డోనర్‌' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో అద్బుతమైన కలెక్షన్లతో పాటు అవార్డులను కూడా పొందింది. కాగా ఈ చిత్రం వీర్యదానం ఆధారంగా రూపొందింది. మరి ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్ర రీమేక్‌ అయినా సుమంత్‌ కెరీర్‌ను మరలా గాడిలో పెడుతుందా? లేదా? చూడాలి. కాగా ఈ చిత్రానికి ఎన్నో టైటిల్స్‌ను అనుకున్నప్పటికీ చివరకు 'నారి నారి డొనారి' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం ద్వారా సుమంత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ గాడిలో పడుతుందని నాగ్‌ అనడంతో యూనిట్‌ సభ్యులు చాలా హ్యాపిగా ఉన్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని హీరో సిద్దార్ద్‌ తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలని భావించాడు. కానీ అప్పటికే ఆ రైట్స్‌ను మధుర శ్రీదర్‌ తీసుకోవడంతో సిద్దార్ద్‌ ఆ ఆలోచన విరమించాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs