Advertisement

బేనర్‌ చూసే శర్వా..సినిమాలు చేస్తాడా!?


యువహీరోలలో మంచి టాలెంటెడ్‌ హీరోగా శర్వానంద్‌కు పేరుంది. అయితే ఆయనకు మంచి నటునిగా పేరొచ్చినప్పటికీ.. శర్వాను కమర్షియల్‌ హీరోగా నిలబెట్టిన చిత్రం మాత్రం 'రన్‌ రాజా రన్‌'. 'రన్‌ రాజా రన్‌; మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రాలతో శర్వానంద్‌ మార్కెట్‌ దాదాపు 15కోట్లకు పెరిగింది. ప్రస్తుతం శర్వానంద్‌ ఏ సినిమా అంటే ఆ సినిమా చేయకుండా సెలక్టెడ్‌గానే చిత్రాలు చేస్తున్నాడు. అఫ్‌కోర్సు.. ఆయన మొదటి నుండి ఇదే దారిలో నడుస్తున్నాడు. కాగా శర్వా.. ప్రస్తుతం బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ బేనర్‌లో తన 25వ ల్యాండ్‌ మార్క్‌ చిత్రం చేస్తున్నాడు. త్వరలో దిల్‌రాజు నిర్మాణ సంస్దలో 'శతమానం భవతి' చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. ఇక శర్వానంద్‌ తాజా కెరీర్‌ను పరిశీలిస్తే ఆయన దర్శకులుగా కొత్తవారిని ఎంకరేజ్‌ చేస్తున్నప్పటికీ నిర్మాతలుగా మాత్రం భారీ సంస్దల్లోనే చేస్తున్నాడు. శర్వానంద్‌ గత మూడు చిత్రాలను యువి క్రియేషన్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ వంటి బేనర్లలో నటించాడు. ప్రస్తుతం కూడా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, దిల్‌రాజులతో చేయడం చూస్తే ఆయన తన కెరీర్‌ను ముందుచూపుతో పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడనే సంగతి అర్దమవుతోంది. సినిమా ఎలావున్నా.. తమ ప్రమోషన్‌తో చిత్రాలను నిలబెట్టకలిగిన నిర్మాతలనే ఆయన ఎంపిక చేసుకుంటున్నాడు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement