మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంప్లీట్ కాక ముందే మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడని సమాచారం. అయితే మహేష్ తర్వాతి సినిమా కొరటాల కాంబినేషన్ లో ఉంటుందని, 'శ్రీమంతుడు' కాంబినేషన్ మళ్లీ ఉండబోతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తాడని... అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల డైరెక్షన్ లో చేయడం లేదట. మహేష్ తన నెక్స్ట్ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో పివిపి నిర్మాణ భాగస్వామ్యం లో చేస్తున్నాడని సమాచారం. వంశీ పైడిపల్లి వరుస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. 'ఊపిరి' సినిమా హిట్ తో మంచి జోష్ మీదున్న వంశీ పైడిపల్లి.. మహేష్ బాబుని డైరెక్ట్ చేస్తున్నాడని... పివిపి సంస్థ అధికారికంగా ప్రకటించేసింది. సో.. మహేష్ ... మురుగదాస్ సినిమా కంప్లీట్ అవ్వగానే వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడన్నమాట. అయితే ఈ విషయాన్ని పివిపి సంస్థ మహేష్ బాబు బర్త్ డే (09-08-16) సందర్భంగా ప్రకటించింది.