ప్రపంచ ప్రఖ్యాత నటుడు జాకీచాన్ నటించిన 'స్కిప్ ట్రాస్' చిత్రం జూలై 21న చైనాలో విడుదలై వసూళ్ళ సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజే ఒక్క చైనాలోనే దాదాపు రూ. 420 కోట్లు వసూలు చేసిందని, వారాంతానికి వెయ్యి కోట్ల వరకు వసూళ్ళు రాబట్టిందని సమాచారం. అయితే పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి వ్యాప్తముగా ప్రేక్షకులకు చూపాలని ఈ మూవీ మేకర్స్ భావిస్తున్నారు.
అందులో భాగంగా సన్ మూన్ పిక్చర్స్ విశ్వాస్ సుందర్ ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఇరు కిళ్ళాడిగల్ పేరుతో, సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే డబ్బింగ్ చిత్రాలకు ఎప్పుడు ముందుండే టాలీవుడ్ నుండి ఈ మూవీ తెలుగు అనువాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ రాకపోవడం విశేషం.