Advertisement
Google Ads BL

భక్తురాలంటే ఇలానే ఉంటుందేమో..!


'అరుంధతి, రుద్రమదేవి, దేవసేన' వంటి పాత్రల్లో నటించిన అనుష్క మరోసారి 'కృష్ణమ్మ' గా అలరించబోతుంది. నాగార్జున - కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలో అనుష్క ఒక భక్తురాలిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో భక్తురాలిగా అనుష్క ఎలావుండబోతోందో చూపించడానికి కె. రాఘవేంద్ర రావు ఒక టీజర్ రిలీజ్ చేశారు.

Advertisement
CJ Advs

Click Here to see the Anushka Krishnamma Look in Om Namo Venkatesaya Video

వెంకటేశ్వర స్వామికి మహా భక్తురాలిగా అనుష్క.. 'కృష్ణమ్మ' పాత్రలో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో కంటే చాలా బావుంది అంటున్నారు అభిమానులు. భక్తురాలు అంటే ఇలానే ఉంటుందా అనే ఫీల్ ని మనకు అనుష్కని చూస్తే కలుగుతుంది. అంత అద్భుతంగా అనుష్కని చూపించాడు రాఘవేంద్రరావు. మరి 'అరుంధతి, రుద్రమదేవి, దేవసేన' పాత్రల్లో మెప్పించిన అనుష్క ఇప్పుడు 'కృష్ణమ్మ' గా ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున 'హాథిరామ్ బాబా' గా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs