బ్రహ్మానందం కి కాలం కలిసి రావడం లేదని... అందుకే ఆయనకి కమెడియన్ గా సినిమా అవకాశాలు తగ్గిపోయాయని ప్రచారం జరుగుతున్నవేళ.... ఇది నిజమే అని చెప్పే సంఘటన మరొకటి జరిగింది. బ్రహ్మానందం ఇంటి వాస్తు బాగోలేకే ...ఏది కలిసి రావడం లేదని... సినిమాల్లో కూడా అవకాశాలు తగ్గిపోయాయని అందుకే తన ఇంటి నుండి మణికొండ లో మరో ఇంటికి మారిన ఆయనకి... ఆ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉందేమో అని అనుమానం వచ్చిందట. అక్కడికి మారినా పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదని.. అందుకే తిరిగి మళ్ళీ పాత ఇంటికి వచ్చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మనందం పరిస్థితి.. ఇలా ఉంటే అయన వియ్యంకుడికి కూడా కాలం కలిసిరావడం లేదట. ఆయన కూడా ఆస్తి తగాదాల్లో ఇరుక్కుని తన ఇంటిని జప్తు వరకు తెచ్చుకున్నాడని సమాచారం. వివరాల్లోకి వెళ్తే బ్రహ్మనందం వియ్యంకుడు శ్రీనివాస్.., అజయ్ కుమార్ అనే వ్యక్తి నుండి కొంత డబ్బు తీసుకున్నాడని.... సకాలంలో ఆ డబ్బు చెల్లించనందుకు అజయ్ కుమార్ హైదరాబాద్ లోని సివిల్ కోర్టును ఆశ్రయించాడని సమాచారం. అయితే కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత డబ్బు ఇవ్వనందుకు గాను బ్రహ్మీ వియ్యంకుడు శ్రీనివాస్ ఇల్లు జప్తు చెయ్యాలని ఆదేశించింది. పాపం బ్రహ్మీ.. తనకే కాదు తన వియ్యంకుడికి కూడా టైం బాగోలేదని తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.