'అపరిచితుడు' తర్వాత చియాన్ విక్రమ్‌కు ఇప్పటివరకు ఓ యావరేజ్ మూవీ కూడా లేదు. తమిళంలో కూడా ఆయనది అదే పరిస్దితి. కమల్‌హాసన్ తర్వాత విలక్షణ పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలు చేయడంలో విక్రమ్‌కి ఓ ప్రత్యేక స్టైల్ ఉంది. విక్రమ్‌కి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం విక్రమ్ 'ఇరుముగన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో కూడా 'ఇంకొక్కడు'గా అనువాదం అవుతోంది. ఈ చిత్ర లుక్స్, ట్రైలర్స్ అందరినీ బాగా అలరిస్తున్నాయి. అయితే విక్రమ్ గత సినిమాల రిజల్ట్ దృష్యా 'ఇరుముగన్' కు బిజినెస్‌పరంగా పెద్ద హైప్ రాలేదు. వరుస ఫ్లాప్‌లలో ఉన్న విక్రమ్‌కు ఈ చిత్రం మంచి హిట్‌ను అందిస్తుందనే నమ్మకం ఉన్నా బయ్యర్లు మాత్రం ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేట్‌కు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మరి తమిళంలో పరిస్ధితే ఇలా ఉంటే తెలుగులో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అయితే ఈచిత్రం తెలుగు అనువాద హక్కులను ఎన్‌కెఆర్ ఫిలిమ్స్ సంస్ద భారీ ఫ్యాన్సీరేటుకు.. అంటే దాదాపు రూ.11.5కోట్లకు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ వరస ప్లాప్ లతో వున్న విక్రమ్ కి తెలుగులో అంత సీన్‌లేదని.. ఇదంతా సినిమా హైప్ కోసం చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని టాలీవుడ్ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.