Advertisement
Google Ads BL

స్టేటస్ కోసం విచిత్ర వేషధారణ..!


చిత్తూరు ఎంపీ, ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, సినీ డైరెక్టర్‌, ఆర్టిస్ట్‌ శివప్రసాద్‌ స్టైలే వేరు. ఆయన తన చిత్ర విచిత్ర వేషధారణలు, చేష్టలతో పార్లమెంట్‌లో అందరినీ ఆశ్చర్చపరుస్తూ ఉంటారు. కాగా ఇప్పటికే చిడతల పాటలు, కొరడాలతో తనను తాను కొట్టుకోవడం వంటివి చేసిన శివప్రసాద్‌ తాజాగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో నిరసన తెలిపే కార్యక్రమానికి ఆయన లోక్‌సభకు వివేకానందుడి గెటప్‌లో వచ్చారు. దాంతో లోక్‌సభలోని అందరి దృష్టిని ఆయన ఆకర్షించి హాట్‌ టాపిక్‌గా మారాడు. మరోవైపు ఆయన రూట్‌లోనే మరో ఎమ్మెల్యే సైతం పీఠాధిపతి లుక్‌లోకి మారిపోయాడు. విశాఖపట్టణం దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పీఠాధిపతి గెటప్‌ వేసుకొని బిజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు నివాసానికి ర్యాలీగా వెళ్లి ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈమధ్యకాలంలో మోడీ ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా పీఠాధిపతులనే గౌరవిస్తున్నారని, అందుకే తాను పీఠాధిపతి అవతారం ఎత్తానని ఆయన చెప్పుకొచ్చాడు. ఏపీలోని బిజెపి ఎమ్మల్యేలు, ఎంపీలు సైతం ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కలసి రావాలని బిజెపి ఎమ్మెల్యే కి... గణేష్‌ వినతిపత్రం అందించాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs