నయనతార.. మరీ ఇంత వయలెంటా ?!


సౌతిండియాలో అటు సీనియర్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు అందరూ కోరుకుంటున్న హీరోయిన్‌ నయనతార. ఆమె పేరు సౌతిండియాలో మరీ ముఖ్యంగా తమిళంలో మారుమ్రోగిపోతోంది. కాగా ఆమె ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఆగష్టు 12న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో ఓ పాట చిత్రీకరణ మిగిలివుంది. కానీ ఎంతకు నిర్మాతలకు ఆమె డేట్స్‌ ఇవ్వకపోతుండటంతో ఆ పాటను తీయకుండానే చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనే నిర్ణయానికి యూనిట్‌ వచ్చింది. అయితే నయన ఓవర్‌యాక్షన్‌ సినిమా యూనిట్‌లనే కాదు.. స్టార్‌హోటళ్ల మేనేజిమెంట్‌కు కూడా తలనొప్పిగా మారుతోంది. ఆమె కోపంతో ఉంటే చిన్నవిషయానికి కూడా హోటల్‌ సిబ్బందిని పెద్దపెద్దగా తిడుతూ, వయలెంట్‌గా దాదాపు కొట్టినంత పనిచేస్తుందని, మరికొన్నిసార్లు ఆమె ఏకంగా హోటల్‌లోని ఫర్నిచర్ ను, అలంకరణ సామగ్రిని కూడా పగులకొడుతుండటంతో ఆమె ఆగడాలు భరించలేని స్టార్‌హోటళ్ల మేనేజ్‌మెంట్‌ ఆమెకు ఆతిధ్యం.. ఇవ్వలేమని ఆమె మేనేజర్‌కు తేల్చిచెప్పాయట. అయినా ఇంత అసహనం ఉంటే ఎలా? మరీ ఇంత వయలెంట్‌గా ఉంటే తాము భరించలేమని, మిగతా కస్టమర్ల నుండి కూడా ఆమెపై కంప్లైంట్స్‌ వస్తున్నాయని స్టార్‌హోటల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ తేల్చిచెప్పాయని సమాచారం. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES