రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటు ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీ తెలంగాణలో మాత్రం డీలాపడిపోయింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు అధికార టిఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయి కారెక్కయడంతో సైకిల్‌కి మనుగడ కష్టమై పోయింది. కాగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్‌రెడ్డి మాత్రం పార్టీలో మిగిలిన మోత్కుపల్లి వంటి నాయకులను పట్టించుకోకుండా తాను అనుకున్న దారిలో వెళ్లడమే గానీ మిగిలిన నాయకులను ఆయన పట్టించుకోవడం లేదు. ఇటీవల జరిగిన మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో రేవంత్‌రెడ్డి ఆందోళన చేసినప్పుడు కూడా టిడిపి బేనర్లు, చంద్రబాబు ఫొటోలను కూడా రేవంత్ వేయలేదు. టిడిపిని అడ్డుపెట్టుకొని ఉండి, రాబోయే రోజుల్లో తెలంగాణలోని బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకం చేసి సొంతగా వేరుకుంపటి పెట్టే యోచనలో భాగంగానే తెలంగాణలో రేవంత్ టిడిపిని కాకుండా, తన సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి చూస్తున్నాడని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.