Advertisement
Google Ads BL

ఇంకెప్పుడు పవన్‌జీ..ప్రశ్నించేది...?


కిందటి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టిడిపికి, మోదీ నేతృత్వంలోని బిజెపి కూటమికి ఓటేయమని పవన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా బాబు, మోదీలతో కలిసి పలు బహిరంగ సభల్లో కూడా ప్రసంగించారు. ఈ కూటమికి ఓటేయాలని, ఈ కూటమిలోని వారు ఎవరైనా ప్రజల హక్కులను హరించినా, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడినా వారిని తాను ప్రశ్నిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ నాటి మోడీ, బాబులతో పాటు పవన్‌ వేదిక పంచుకున్న సభలో పవన్‌ సాక్షిగా మోదీ తాను ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరం, రైల్వేజోన్‌, రాజధాని వంటి పలు అంశాలపై హామీ ఇచ్చాడు. ఢిల్లీని మించిన స్దాయిలో రాజధాని నిర్మించి ఇస్తానని మాటిచ్చాడు. దానికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లతో పాటు ఏపీలోని ప్రజలకు హామీ ఇచ్చారు. అసలు విభజన సమయంలో ప్రత్యేక హోదా అని కెలికింది కూడా వెంకయ్యనాయుడే. కానీ ప్రస్తుతం బిజెపి మాటతప్పుతోంది. ఇంతకాలం పవన్‌ ఈ విషయంలో నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు ఆయన నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. రాజ్యసభ సాక్షిగా అరుణ్‌జైట్లీ ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ప్రకటించారు. సో.. ఏకంగా జైట్లీనే ఇలా మాట్లాడాడంటే దాని అర్ధం ఈ ప్రకటనలో మోదీ హస్తం కూడా ఉందని, మోదీకి కూడా అదే ఉద్దేశ్యమని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా పవన్‌ బయటకు వచ్చి మోదీని ప్రశ్నించి తన గళం కూడా వినిపించాలి. ఇప్పటికీ పవన్‌ మాట్లాడకపోతే అది ఆయన ఇమేజ్‌కు, మాట విలువకు తూట్లు పొడుస్తుంది. అలా చేయకపోతే ఈ అన్యాయంలో మోదీతో పాటు చంద్రబాబు, పవన్‌లు కూడా భాగస్వాముల కిందనే ఏపీ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకాలం పవన్‌ది వ్యూహాత్మక మౌనం అని భావించారు. కానీ ఇప్పటికీ ఆయన ఈ విషయంలో బిజెపిని నిలదీయకపోతే అది పవన్‌ ఇమేజ్‌ను ఖచ్చితంగా దెబ్బతీస్తుందనేది వాస్తవం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs