Advertisement
Google Ads BL

ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ రానిస్తారా..!!


రాజ్యసభలో కాంగ్రెస్‌ నాయకుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ బిల్లు పాస్‌ అయ్యే ఛాన్సే లేనట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టి.. పెద్ద తప్పిదమే చేశామని భావించిన కాంగ్రెస్‌..ఏపీలో తమ పార్టీని పునర్నిమాణం కోసం పాకులాడుతుంది. వారు చేసిన తప్పును తెలుసుకుని మళ్ళీ తప్పు సరిదిద్దుకోవాలని, సుమారు 2 సంవత్సరాలుగా వెయిట్‌ చేస్తున్న కాంగ్రెస్‌కి స్పెషల్‌ స్టేటస్‌ రూపంలో మంచి ఛాన్స్‌ దొరికింది. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ తెప్పించగల్గితే..ఏపీలో కాంగ్రెస్‌కి మంచిరోజులు వచ్చినట్లే. అయితే దీనికి టిడిపి, బిజెపి అంత సుముఖంగా లేవు. క్రెడిట్‌ కాంగ్రెస్‌కి రాకూడదని బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అసలు ఈ బిల్లు పనికిరాదంటూ..కూడా ఈ మధ్య తీర్పు ఇప్పించింది. కానీ 5 తారీఖు ఓటింగ్‌కి అనుమతించినా..ఈ బిల్లుకి ఓటింగ్‌ రాకుండా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా క్రెడిట్‌ కొట్టేసిన చంద్రబాబు కూడా తన మిత్రపక్షమైన బిజెపిపై పోరాటానికి దిగేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇక్కడ చంద్రబాబు చేసిన తప్పిదం క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ రెండు సంవత్సరాలుగా స్పెషల్‌ స్టేటస్‌ విషయంలో కామ్‌గా వ్యవహరించిన చంద్రబాబు..కాంగ్రెస్‌ ముందుకు రావడంతో..తన పంథా మార్చి ఇప్పుడు బిజెపికి వ్యతిరేకమన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు ఎన్ని చేసినా..తలుపులు మూయించి, మీడియాకి అవకాశం లేకుండా.. స్టేట్‌ని డివైడ్‌ చేసిన కాంగ్రెస్‌ మాదిరిగా.., అధికారంలో ఉన్న బిజెపి తలుచుకుంటే మరోమారు ఓటింగ్‌ జరగకుండానే..మెజార్టీ ఓటింగ్‌ రాలేదని చూపించగలదు. ఇలా అయితే ఇక ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ కలే అవుతుంది. సో..అసలు 5 తారీఖు ఇలాంటిది ఏం జరగకుండా..మెజార్టీ ఓటింగ్‌ అనుకూలంగా రావాలని కోరుకుందాం..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs