'కబాలి' సినిమా కలెక్షన్లతో మంచి జోష్ లో వున్న రజినీకాంత్ ఈ మధ్యే తనకు శస్త్ర చికిత్స పూర్తయినాక ఇండియా తిరిగొచ్చారు. 'కబాలి' సినిమా అంచనాలకు మించి వసూలు చేస్తుండడంతో ఆ సినిమా డైరెక్టర్ రంజిత్ పా, రజినీకాంత్ చాలా సంతోషం గా వున్నారు. అయితే తమిళం లో రజినీకాంత్, కమల్ హాసన్ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పుడు మంచి పొజిషన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కమల్ హాసన్ 'శభాష్ నాయుడు' షూటింగ్ లో ఉండగా తన ఆఫీస్ మెట్ల మీదనుండి జారి పడగా కాలికి దెబ్బతగిలిందనేది తెలిసిన విషయమే. ఆ కాలికి ఒక సర్జెరీ చేసి డాక్టర్స్ ఇంకొన్నిరోజుల తర్వాత మరో సర్జరీ చెయ్యాలని చెప్పారని.... అప్పటి వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పారట. ఇక రజినీకాంత్ అప్పుడు అమెరికాలో ఉండడం వల్ల కమల్ ని పలకరించలేకపోయాడని... ఇప్పుడు ఇండియాకి వచ్చాక కలవాలి అనుకున్నాడట. కానీ కమల్ మరో సర్జరీ లో ఉండడం వలన రజిని కమల్ కి ఫోన్ చేసి పరామర్శించాడని సమాచారం. వీరిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఎవరికీ వారే సెపరేట్ గా అభిమానుల అభిమానం సొంతం చేసుకుని ఎవరి టాలెంట్ తో వారు తమిళ ఇండస్ట్రీ ని ఏలుతున్నారు.