హాట్ హాట్ న్యూస్ కోసం తహతహలాడుతూ... తమ పాఠకులకు వివాదాస్పద వార్తలను అందించాలని.. పాఠకుల మెప్పు పొందాలనేది సాక్షి పత్రిక లక్ష్యం. ఆ దిశలోనే ఇప్పటి వరకు పలు సంచలనాల కథనాలు, ఇంటర్వ్యూలను ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల సాక్షి ఫ్యామిలీ పేజిలో ప్రచురించిన గాయనీ సునీత ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఎక్కడా తన ఫ్యామిలీ విషయాల గురించి నోరు మెదపని సునీత సాక్షి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తన భర్త కిరణ్‌తో తను ఎందుకు విడిపోయానో... అతని వ్యక్తిత్వం... ఇలా పలు అంశాలతో పాటు ఎంపీ మధుయాష్కీకి తనకు ఎఫైర్ వుందనే పుకార్ల గురించి.. ఇలా సునీత పలు సంచలన విషయాలను బహిర్గతం చేసింది. సో.. ఈ ఇంటర్వ్యూ సాక్షి పత్రికకు మంచి మైలేజ్‌నే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇదే విధంగా భర్త జోగి నాయుడుతో విడాకులు తీసుకొని ఆయనకు దూరంగా వుంటున్న యాంకర్ ఝాన్సీ కూడా త్వరలో సాక్షికి ఇలాంటి సంచలన ఇంటర్వ్యూ ఇవ్వబోతుందనే.. వార్తలు వినిపిస్తున్నాయి.