ఇటీవల జరిగిన 'మా' టీవీ వారు నిర్వహించిన 'మా' సినీ అవార్స్‌లో సదరు చానెల్ వారు ఎన్టీఆర్‌ను ఉత్తమనటుడి అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్‌లు కలిసి నటిస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రానికి భారీ అంచనాలే ఉన్నాయి.ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం జెమినిటీవీతో పాటు మా టీవీ కూడా పోటీపడింది. వాస్తవానికి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ జెమినిటీవీకే దక్కుతాయని అందరూ భావించారు. కానీ ఈ చిత్రం రైట్స్‌ను ఎట్టకేలకు మాటీవీ 12.5కోట్లకు తీసుకుందని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే శాటిలైట్‌పరంగా భారీ రేటు పలికిన చిత్రం. మొత్తానికి మాటీవీ వారు ఎన్టీఆర్‌కు అవార్డు ఇచ్చి, ఈ చిత్రానికి గాలం వేశారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. కానీ ఈ చిత్ర నిర్మాతలైన మైత్రిమూవీస్ అధినేతలు మాత్రం అలాంటిదేమీ లేదని, మాటీవీ ఎక్కువ బిడ్ వేయడంతో వారికే రైట్స్ ఇచ్చామని చెబుతున్నారట.