తెలుగు సినిమా రంగంలో తెలివిగా వ్యాపారం చేసే అతికొద్ది మంది నిర్మాతల్లో అల్లు అరవింద్ ప్రముఖుడు. ఆయన మేధస్సు గురించి, ఆయన వ్యాపార పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ మెగా కాంపౌండ్‌లోని హీరోలను ఎలా ప్రమోట్ చేయాలో... వారితో.. ఎలాంటి సినిమా ఎంత బడ్జెట్‌లో నిర్మించాలో... ఆ సినిమాను ప్రేక్షకులకు ఎలా రీచ్ చెయ్యాలో..అల్లు అరవింద్‌కు బాగా తెలుసు. అంతేకాదు ఏ సినిమాను ఎలా వదిలించుకోవాలో కూడా ఈ నిర్మాతకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. వివరాల్లోకి వెళితే... అల్లు అరవింద్ తనయుడు శిరీష్ నటించిన తాజా చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం వచ్చే నెల (ఆగష్టు) 5న విడుదల కానుంది. అయితే ఈ చిత్ర పంపిణీహక్కులు తీసుకున్న వారికే చరణ్-సురేందర్ రెడ్డి కలయికలో రాబోతున్న చిత్రం హక్కులు ఇస్తానని డిస్ట్రిబ్యూటర్స్‌కు లింకు పెడ్డాడట అల్లు అరవింద్. అందుకే చరణ్ సినిమా కావాల్సిన వాళ్లు 'శ్రీరస్తు శుభమస్తు' చిత్ర పంపిణీ హక్కులను తప్పక తీసుకుంటున్నారట. సో.. ఇది తెలిసిన వాళ్లంతా చరణ్‌ను ఎరగా వేసి 'శ్రీరస్తు శుభమస్తు' పంపిణీ హక్కులను అరవింద్ వదిలించుకుంటున్నాడని అంటున్నారు.