Advertisement
Google Ads BL

చంద్రబాబు..అంతా గమనిస్తూనే వున్నాడు!


తాము పేరుకు ఎన్డీఏ భాగస్వాములమే కానీ తమకు, తమ రాష్ట్రానికి వీసమెత్తు సహాయం చేయకుండా, విభజన సమయంలో చేసిన హామీలను కూడా నెరవేర్చని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర అసహనంగా ఉన్నాడు. కానీ ఆయన మౌనంగా అన్నింటినీ వీక్షిస్తున్నారు. త్వరలో ప్రధాని మోదీ రెండేళ్ల తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నాడు. ఈ పర్యటన అధికారికంగా ఖరారైనప్పటికీ, ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ప్రకటన లేదు. కానీ మోడీ రావడం మాత్రం ఖరారైందని సమాచారం. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబునగర్‌ జిల్లాలలో పర్యటించి మిషన్‌ భగీరధతో పాటు పలు అభివృద్ది పనులకు ప్రారంబోత్సవాలు, శంకుస్దాపనలు చేయనున్నాడు. ప్రధాని మోదీని ఘనంగా ఆహ్వానించి.. తన స్టామినా ఏమిటో చూపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ పలు పథక రచనలు చేస్తున్నారు. తెలంగాణకి వచ్చిన సందర్భంగా మోదీ ఏం మాట్లాడనున్నాడు? ఎలాంటి సాన్నిహిత్యం కేసీఆర్‌కు అందించనున్నాడు.? జరుగుతున్న రాజకీయ పరిణామాలను, రాజకీయ పునరీకీరణ స్దితిగతులను బాబు నిశితంగా పరిశీలిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs