రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు.. ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రైవైట్ బిల్లు విషయంలో చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్ సభ్యులు.. వెల్‌లోకి దూసుకెళ్లి హంగామా చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో టిడిపి ఎంపీలు కూడా తమ తమ స్దానాల్లోనే నిలబడి చర్చ జరపాలని గట్టిగా అరుస్తుండిపోయారు. అదే సమయంలో తన స్దానంలో నిలుచొని నినాదాలు చేస్తున్న టిడిపి ఎంపీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన సీఎం రమేష్ ని చూసిన కెవిపి.. ఆయన సీటు వద్దకు వెళ్లి ఆయన్ను కూడా వెల్‌లోకి తీసుకొనిపోయాడు. తీరా చూస్తే వెల్‌లో కాంగ్రెస్ ఎంపీలు తప్ప టిడిపి నేతలెవ్వరు కనిపించలేదు. దీంతో కాసేపు షాక్‌కు గురైన సీఎం రమేష్ తాను కెవిపి చేతిలో కీలుబొమ్మనైనానని కనిపెట్టి వెనక్కి వచ్చేశాడట. మొత్తానికి కేవీపీ.. సీఎం రమేష్‌ను చంద్రబాబు వద్ద బుక్ చేశాడని టిడిపి ఎంపీలు సెటైర్లు విసురుతున్నారు.