Advertisement
Google Ads BL

కమల్‌ చిత్రానికి కష్టకాలం...!


కొన్ని కొన్ని సంఘటనలు లాజిక్కులకు అందవు. కాకతాళీయమో, విధి విచిత్రమో గానీ కొన్ని సార్లు అవి అనేక అనుమానాలకు దారి తీస్తాయి. ఇక కమల్‌హాసన్‌ విషయానికి వస్తే ఆయన చిత్రాలకు ఈ మధ్యకాలంలో రిలీజ్‌ సమస్యలు వస్తున్నాయి. తాజాగా ఆయన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్త భాగస్వామ్యంలో కమల్‌, రమ్యకృష్ణ, శృతిహాసన్‌, బ్రహ్మానందం కీలకపాత్రల్లో 'శభాష్‌నాయుడు' చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం అమెరికాలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని వచ్చింది. వాస్తవానికి ఈ చిత్రానికి మలయళ డైరెక్టర్‌ రాజీవ్‌కుమార్‌ దర్శకత్వం వహించాల్సివుంది. కానీ షూటింగ్‌ ప్రారంభ దశలోనే ఆయనకు ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం కమల్‌ దర్శకత్వంలోనే రూపొందుతోంది. ఇక ఇటీవల కమల్‌ జారిపడిపోవడం, ఆయన కాలుకు సర్జరీ జరగడంతో షూటింగ్‌కు గ్యాప్‌ వచ్చింది. ఇక ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్న జోసఫ్‌ భార్యకు యాక్సిడెంట్‌ కావడంతో ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో సమస్య ఎదురుకావడంతో ఈ చిత్ర ఫొటోగ్రాఫర్‌ గుమ్మడి జయకృష్ణ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. దీంతో అసలు ఈ చిత్ర యూనిట్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలని కమల్‌ భావిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs