మల్లన్న సాగర్‌కు వ్యతిరేక ఉద్యమం తెలంగాణలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఆందోళన చేస్తున్ప ప్రతిపక్షాలను, ఉద్యమకారులను టిఆర్‌ఎస్ సర్కార్ అరెస్ట్ చేస్తోంది. దీనిపై కోదండరాం వంటివారు మండిపడుతున్నారు. గతంలో కూడా కోదండరాంపై ముందు వెనుక చూడకుండా తీవ్ర విమర్శలు చేసిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎవ్వరినైనా సరే అరెస్ట్ చేసైనా సరే మల్లన్న సాగర్‌ను కట్టితీరుతామని, తెలంగాణ అభివృద్ది చెందడం ఇష్టంలేని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడిన విధానంపై ఉద్యమకారుల నుండి ప్రతిపక్షనాయకుల నుంచి టిఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అసలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తలసాని ఏమి చేశాడు? ఆయన ఉద్యమంలో ఏమైనా పాత్ర పోషించాడా? మరి అలాంటి తలసానికి ఉద్యమకారులను, కోదండరాంను విమర్శించే అర్హత ఉందా? అని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇకనైనా ఆయన తలతిక్కగా, అహంభావంగా మాట్లాడటం మానుకోవాలని, లేకపోతే ఆయనకు తమ ప్రతాపం చూపించాల్సివస్తుందని ఉద్యమనేతలు అంటున్నారు.