చిరంజీవి 150 సినిమా.. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో, రామ చరణ్ నిర్మాతగా.. కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తమిళ 'కత్తి' కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయము తెలిసిందే. అయితే ఈ సినిమాకి అంతా 'కత్తిలాంటోడు' అని టైటిల్ పెట్టారని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ 'కత్తిలాంటోడు' కాదు టైటిల్ అని చెప్పడంతో ఫోకస్ అంతా 'ఖైదీ నెం 150' పై పడింది. ఈ టైటిల్ అయితే బావుంటుందని... రామ్ చరణ్ కి కూడా ఈ టైటిల్ నచ్చిందని ప్రచారం జరిగింది. కానీ ఆ టైటిల్ కూడా ఫైనల్ కాలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా కి టైటిల్ సెట్ అయింది. ఈ మూవీ అంతా రైతుల చుట్టూ... వారి సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మంచి టైటిల్ పెట్టాలని ఆలోచించిన యూనిట్ ఈ మూవీ కోసం 'నెపోలియన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. పోరాటం అతని నైజం అనే టాగ్ లైన్ తో సోషల్ మీడియా లో ఒక పోస్టర్ రివీలైంది. మరి ఈ సినిమాకి ఈ టైటిల్ చక్కగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా హీరోయిన్ ని ఫైనల్ చేసేందుకు యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.