Advertisement
Google Ads BL

ఆ సత్తా 'బాహుబలి 2' కే ఉంది!


సౌతిండియాలో ఇప్పటివరకు 'బాహుబలి-ది బిగినింగ్‌'ను ఎదుర్కొనే చిత్రం రాలేదు. విడుదలకు ముందు 'కబాలి'కి అంత హైప్‌ వచ్చినప్పటికీ సినిమా విడుదల తర్వాత ఈ చిత్రం చప్పబడిపోయింది. కాగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రమే 'బాహుబలి1' రికార్డులను బద్దలు కొట్టగలదని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'బాహుబలి1' దాదాపు 650 కోట్లు కొల్లగొట్టిన టీమ్.. ఈ చిత్రం రెండో పార్ట్‌కు 1000కోట్లను టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీంతో ఈ చిత్రం రైట్స్‌ను దక్కించుకోవడానికి బయ్యర్లు నోట్ల కట్టలతో క్యూలో నిలబడి ఉన్నారు. ఈ చిత్రం రైట్స్‌ను దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్‌సీస్‌ రైట్స్‌ను 37కోట్లకు ఓ సంస్ద దక్కించుకొందని సమాచారం. అలాగే తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ను ఏకంగా 50కోట్లకు దక్కించుకోవడానికి ఓ తమిళ నిర్మాత ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 'కబాలి' కూడా ఔట్‌ అయిపోవడంతో ఇప్పుడు అందరికళ్లు 'బాహుబలి2', 'రోబో2.0' ల పైనే వున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs