ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, బిజెపిని దెబ్బకొట్టి అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పంజాబు, గోవా రాష్ట్రాలను ఆయన తన లక్ష్యంగా ఎంచుకున్నారు. చిన్న రాష్ట్రాలైన ఈ రెండింటిలో తమకు వచ్చే మద్దతుపై పునరాలోచించుకుని ఆపై దేశవ్యాప్తంగా ఎలా బలపడాలో చూడాలని కేజ్రీవాల్ ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంపై దృష్టిపెడితే పంజాబు, గోవాలకు న్యాయం చేయలేమని, అందుకే ముందు ఈ రెండు చిన్న రాష్ట్రాల్లో పాగా వేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈరెండు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఆప్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయనే చెప్పవచ్చు. మరి ఈ విషయంలో కేజ్రీవాల్ ఢిల్లీలో వలే సక్సెస్ అవుతాడా?లేదా? అనేది వేచిచూడాల్సివుంది.