Advertisement
Google Ads BL

ఆఖరికి కళ్యాణ్‌రామ్‌ నూ వదలట్లేదు..!


దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చేతిలో పడ్డాడంటే చాలు.. ఆ హీరో రూపురేఖలనే మార్చేస్తాడు. ప్రస్తుతం ఆయన నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా కళ్యాణ్‌రామ్‌ సొంత బేనర్‌ అయిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బేనర్‌లో 'ఇజం'అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూరీ.. కళ్యాణ్‌రామ్‌ను ఎంతో స్టైలిష్‌, మాస్‌ లుక్‌లో చూపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్స్‌ చూసి అందరూ ఫిదా అయిపోయారు. కాగా ఓ సామాజిక అంశం చుట్టూ ఈ చిత్రం తిరగనుంది. ఇందులో కళ్యాణ్‌రామ్‌ జర్నలిస్ట్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ను మరింత విభిన్నంగా చూపించాలని ప్లాన్‌ చేస్తోన్న దర్శకుడు పూరీ హీరో కళ్యాణ్‌రామ్‌ను ఇందులో సిక్స్‌ప్యాక్‌లో చూపించనున్నాడట. మొత్తానికి పూరీ కోసం కళ్యాణ్‌రామ్‌ ఎంతో కష్టపడుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 29న విడుదల చేయాలని భావిస్తున్నారు. అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs