Advertisement
Google Ads BL

మహేష్ కి మదర్ గా ఆమెని ఓకే చేశారు!


ప్రిన్స్ మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా ముందు పరిణీతి చోప్రాను అనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేయడం వల్ల.. ఆ ప్లేస్ లోకి రకుల్ ప్రీత్ వచ్చి చేరింది. అయితే ఈ సినిమాలో మహేష్ కి తల్లిగా నటించేందుకు ఎవరైతే బావుంటుందా అని డైరెక్టర్ మురుగదాస్ తెగ ఆలోచిస్తున్నాడట. టాలీవుడ్ లో మదర్ కేరెక్టర్స్ చేసే వారి గురుంచి సెర్చ్ చేసిన మురుగదాస్ కి పెద్దగా ఎవరు నచ్చలేదట. అయితే ఈ మధ్య 'బిచ్చగాడు' సినిమాలో అమ్మ కేరెక్టర్ చేసిన దీప రామానుజం అయితే బావుంటుందని మురుగదాస్ అనుకుంటున్నాడట. ఈ సినిమాలో ఆమె చేసిన కేరెక్టర్ కి మంచి పేరొచ్చింది. మరి బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా పరిచయమైన దీప.. ఈ సినిమాలో మహేష్ కి మదర్ గా చేస్తే ఆమెకు ముందు ముందు టాలీవుడ్, కోలీవుడ్ లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని అనుకుంటున్నారు. ఈ మూవీ జూలై 29నుంచి సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌తో పాటు ఠాగూర్‌ మధు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి హరీష్‌జైరాజ్‌ సంగీతం అందిస్తుండగా, సంతోష్‌శివన్‌ ఫొటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs