Advertisement
Google Ads BL

మెగాస్టార్‌ సినిమాకు స్పెషల్‌ హంగులు....!


ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి వినాయక్‌ దర్శకత్వంలో తమిళ 'కత్తి'కి రీమేక్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ 'కత్తి' సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పాత్ర చాలా తక్కువ. ఈ చిత్రం సీరియస్‌ మూడ్‌తో సాగుతుంది. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రానికి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను రంగరిస్తున్నాడు దర్శకుడు వినాయక్‌. ఇందుకోసం ఈ చిత్రంలో అలీ, వెన్నెల కిషోర్‌తో పాటు సంపూర్ణేష్‌బాబు వంటి కమెడియన్లును తీసుకున్నాడు వినాయక్‌. ఈ చిత్రంలో చిరంజీవి చేసే నాయకుడు పాత్ర సీరియస్‌గా సాగుతుంది. కానీ దొంగ పాత్ర మాత్రం మాంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని సమాచారం. ఇక చిరుకు జోడుగా అలీ, వెన్నెల కిషోర్‌, సంపూర్ణేష్‌బాబులు ఉంటే ఇక ఆ కిక్కే వేరుగా ఉంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఓ సీరియస్‌ సబ్జెక్ట్‌కు మార్పులు చేర్పులు చేసి ఎంతగా కామెడీకి వినాయక్‌ పెద్ద పీట వేశాడో సినిమా విడుదలైతే కానీ తెలియదు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs