Advertisement
Google Ads BL

'గౌతమిపుత్ర శాతకర్ణి'ని బాలయ్యే ఆపేశాడు!


బాలయ్య నటిస్తున్న వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం కొద్దికాలం పాటు ఆగిపోయింది. ఈ చిత్రాన్ని హఠాత్తుగా బాలయ్యే ఆపించేశాడు. ఇంతకీ అసలు కారణం ఏమిటంటే... ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్‌కు పోయిన నెలలోనే నిశ్చితార్దం జరిగింది. ఆగష్టు 8న క్రిష్‌కు వివాహం జరగనుంది. పెళ్లికి కేవలం కొద్దిరోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ చిత్రాన్ని అనుకున్న షెడ్యూల్‌ కంటే ముందే ఆపించిన బాలయ్య.... క్రిష్‌కు పెళ్లి పనుల విషయంలో సమయం ఇవ్వడం కోసం విరామం ఇచ్చాడు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ క్లైమాక్స్‌ సన్నివేశాలు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రిష్‌ పెళ్లి పనుల్లో బిజీగా వున్నాడు. పెళ్లి తర్వాత కేవలం కొద్దిరోజుల గ్యాప్‌ తీసుకొని క్రిష్‌ మరలా ఈ చిత్రం షూటింగ్‌లో బిజీ అవ్వనున్నాడు. మొత్తానికి క్రిష్‌ కోసం షూటింగ్‌ను స్వయంగా ఆపించిన బాలయ్య ఈ విషయంలో తన పెద్దమనసును చాటుకున్నాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs