Advertisement
Google Ads BL

పవన్ హీరోయిన్ ఎవరో చెప్పేశాడు?


'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' డిజాస్టర్‌ తర్వాత పవన్‌కళ్యాణ్‌ తన స్నేహితుడు శరత్‌మరార్‌కు మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్‌.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా ఆయన హఠాత్తుగా తప్పుకోవడంతో 'గోపాల...గోపాల' ఫేమ్‌ డాలీని దర్శకునిగా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది. కాగా సూర్య దర్శకత్వం వహించాల్సినప్పుడే ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఖరారు చేశాడు. కానీ డాలీ చేతికి పగ్గాలు రావడం, సినిమా ప్రారంభం ఆలస్యం కావడంతో శృతిహాసన్‌ ఈ చిత్రంలో నటిస్తుందా? లేక ఆమె స్దానంలో మరొకరిని తీసుకుంటారా? అనే అంశం ఆసక్తిని కలిగించింది. కానీ ఎట్టకేలకు ఈ విషయంలో నిర్మాత శరత్‌మరార్‌ ఈ చిత్రంలో శృతిహాసన్‌ నటిస్తోందని, ప్రీపోడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, ఆగష్టులో ఈ చిత్రం పట్టాలెక్కనుందని ట్వీట్‌ చేశాడు. దీంతో పవన్‌ చిత్రంపై ఓ క్లారిటీ వచ్చింది. మొత్తానికి 'గబ్బర్‌సింగ్‌'జోడీ మరోసారి ఈ చిత్రంతో స్క్రీన్‌పై మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs