Advertisement
Google Ads BL

కొరటాల శివకు 14, మహేష్‌బాబుకు 25!


ఈకాలంలోని నిర్మాతలందరూ హిట్‌ కాంబినేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కథను నమ్ముకోకుండా హిట్‌ కాంబినేషన్‌ని రిపీట్‌ చేసి దానిని క్యాష్‌ చేసుకోవడానికి వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మహేష్‌బాబు-కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' చిత్రం.. 'బాహుబలి' మినహా మిగిలిన నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా నిర్మాత డి.వి.వి.దానయ్య దగ్గర కొరటాల శివ డేట్స్‌ ఉన్నాయి. దాంతో దానయ్య.. మహేష్‌బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దానయ్య.. మహేష్‌కు, కొరటాల శివలకు భారీ రెమ్యూనరేషన్లు ఆఫర్‌ చేసి ఈ జోడీని కలిపాడని తెలుస్తోంది. కొరటాల శివకు 14కోట్లు, మహేష్‌బాబుకు 25కోట్లను ఆయన ఆఫర్‌ చేయడంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్‌తో 'జనతాగ్యారేజ్‌' చిత్రం చేస్తున్నాడు. మహేష్‌.. మురుగదాస్‌ సినిమా చేయాల్సివుంది. వీరిద్దరు ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత కొరటాల-మహేష్‌-దానయ్యల చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs