ఈతరం హీరోయిన్లలో డ్యాన్స్‌లు ఇరగదీయడంలో, మంచి డ్యాన్సర్లుగా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్, అల్లుఅర్జున్,రామ్‌చరణ్ వంటి వారికి ధీటుగా స్టెప్స్ వేయగల సత్తా ఉన్న హీరోయిన్‌గా తమన్నాకు మంచి పేరుంది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం మైత్రీ మూవీస్ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'జనతాగ్యారేజ్' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మోహన్‌లాల్, సమంత, నిత్యామీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదలకు సిద్దమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సుమారు 50లక్షల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ జోడయింది. ఈ చిత్రంలోని ఓ ఐటం సాంగ్‌లో తమన్నా, ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులు వేయనుంది. గతంలో కూడా తమన్నా 'అల్లుడుశ్రీను, స్పీడున్నోడు' వంటి చిత్రాల్లో ఐటం సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐటం సాంగ్ కేవలం మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని కొరటాల తెరకెక్కిస్తున్నాడట. ప్రీ క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఈ ఐటం సాంగ్ మాస్‌ను ఉర్రూతలూగించేలా ఉంటుందని సమాచారం.