సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం నేడు(జులై 22) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం చేసిన ప్రీరిలీజ్ బిజినెస్‌ను చూసి ట్రేడ్‌పండితులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు శాటిలైట్ హక్కులను ఓ థర్డ్ పార్టీ 8కోట్లకు చేజిక్కించుకుందని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం పలు ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. ఈ చిత్ర టాక్ ఎలా ఉన్నా మొదటి వారం కలెక్షన్లకు ఢోకా ఉండదు. అలాగే సినిమా రిజల్ట్ ఏమిటో కూడా ఈ రోజే తేలనుంది. ఈ నేపథ్యంలో ఓ డబ్బింగ్ చిత్రానికి 8కోట్లు శాటిలైట్ రైట్స్ పలకడం ఓ అద్భుతమే అయినా ఈ చిత్రం సాధించే విజయం ఏ స్దాయిలో ఉంటుంది అనే దాని కోసం ఛానెల్స్ వేచిచూస్తున్నాయి. రజిని మీద నమ్మకంతో అంత మొత్తం చెల్లించి శాటిలైట్ రైట్స్ తీసుకున్న ఈ థర్డ్ పార్టీని రజనీ 'కబాలి' ఏం చేస్తుందో చూద్దాం?