Advertisement
Google Ads BL

రాహుల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో?


2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ... మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమని వ్యాఖ్యానించాడు. ఈ మాటలను బిజెపితో పాటు ఆరెస్సెస్‌ వర్గాలు కూడా తీవ్రంగా ఖండించాయి. తెలిసి తెలియక మాట్లాడి, తమ పరువుకు నష్టం చేకూర్చాడని ఆరెస్సెస్‌ సుప్రీంకోర్టులో రాహుల్‌పై కేసు వేసింది. తాజాగా ఈ వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు కూడా రాహెల్‌గాంధీపై మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తావని సుప్రీం రాహుల్‌ను ప్రశ్నించింది. ఇక రాహుల్‌కు ఈ విషయంలో రెండు మార్గాలను సూచించింది. ఒకటి... ఈ వ్యాఖ్యలపై రాహుల్‌ బహిరంగ క్షమాపణ చెప్పి, తన తప్పు ఒప్పుకోవాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని. లేని పక్షంలో విచారణకు సిద్దంగా ఉండాలని సూచించింది. ఈ తీర్పుపై హిందు మత సంస్థలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బిజెపికి కూడా ఇది తీపి వార్తే అనడంలో సందేహం లేదు. మరి సుప్రీం సూచించిన రెండు మార్గాల్లో రాహుల్‌గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs