ఇప్పుడు అందరిచూపు మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందే చిత్రంపైనే ఉంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా ఆగష్టులో ప్రారంభం అవుతుందని సమాచారం. కాగా ఈచిత్రంలో నటించే నటీనటుల ఎంపికలో దర్శకుడు మురుగదాస్ ఆచితూచి అడుగువేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపు ఉన్న వారినే ఈ చిత్రానికి ఎంపిక చేస్తున్నాడు. కాగా 1980లలో హీరోయిన్‌గా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకుని, ఇటీవలి కాలంలో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిన సీనియర్ నటి నదియా ఈచిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'మిర్చి, అత్తారింటికి దారేది, దృశ్యం, అఆ ' ఇలా వరస చిత్రాలతో దూసుకెళ్లుతున్న ఆమె మహేష్,మురుగదాస్‌ల చిత్రంలో నటించే పాత్రపై క్లారిటీ వచ్చిందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో విలన్‌గా తమిళ, తెలుగు దర్శకుడు ఎస్.జె.సూర్య నటిస్త్నున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పాత్రలో నదియా ఓ కీలకమైన పాత్రను చేయనుంది తెలుస్తోంది. మొత్తానికి నదియా సెంటిమెంట్ ఈ చిత్రానికి మంచి ప్లస్ అవుతుందని అంటున్నారు.